ముందస్తు ఉండదు… షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : సీఎం కేసీఆర్
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రతి మంత్రి మరో ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. వంద ఓటర్లకు ఒక ఇన్ చార్జిని నియమించాలన్నారు. 10 రోజుల్లో ఇన్ ఛార్జుల నియామకం పూర్తి కావాలన్నారు. బీజేపీతో ఇక యుద్ధమేనని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలంతా ఫీలÊ్డలోనే ఉండాలని, క్యాలెండర్ బేసిస్గా వర్క్ చేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.













