సీఎం కేసీఆర్ మలివిడత ప్రచార షెడ్యూల్ ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మలివిడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు, ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం మరింత ఊపు తీసుకురానుంది. గులాబీ దళపతి ప్రచార షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
ఈ నెల 19న ఖమ్మంం, పాలకుర్తిలో
20న సిద్ధిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో
21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్లో
22న ఖానాపూర్, ఇచ్చోడ (బోథ్ నియోజకవర్గం),నిర్మల్, ముథోల్, ఆర్మూర్లో
23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామలో
25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర షాద్నగర్, ఇబ్రహీంపట్నంలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.













