రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట ఎయిర్‌బేస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. రాష్త్రపతిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఆర్మీ నేవీ అధికారులు ఉన్నారు. అనంతరం భారత సైనికుల గౌరవ వందనాన్ని ద్రౌపది ముర్ము స్వీకరించారు.













