మళ్లీ బీఆర్ఎస్ దే విజయం : సీఎం కేసీఆర్
ఎగ్జిట్ పోల్స్‌తో పరేషాన్ కావొద్దని, మళ్లీ బీఆర్ఎస్నే విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని, రాష్ట్రాన్ని పాలించబోయేది బీఆర్ఎస్నే అని చెప్పినట్టు సమాచారం. ఇవాళ, రేపు ఓపిక పడితే 3వ తేదీ సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.













