ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారన్నారు. తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తూ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. కొందరు చిల్లర, మల్లరగాళ్లు చేస్తున్న ఉత్తుత్తి ప్రచారంగా ఆయన కొట్టిపారేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల ముందుగానే చెబుతున్నా రాసుకోండి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 95 నుంచి 105 సీట్లు లభిస్తాయన్నారు.













