రాష్ట్ర సుభిక్షానికి యాగం
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామలయాగం చేపట్టాఆరు. రెండురోజుల పాటు నిర్వహించే ఈ యాగం ఆదివారం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 11:11 గంటలకు నిర్వహించే పూర్ణాహుతి జరుగుతుంది. అదే రోజు ఏకరాత్రి దీక్షలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం తలపెట్టారు. రాజశ్యామల యాగంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అన్ని ఆగ్రహాలను హోమలు, చండీయాగం నిర్వహించారు. విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర సర్వస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













