కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ సాయన్న మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవను, తనతో వారికున్న అనుబంధాన్ని, సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇందిరా పార్కు వద్దగల కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి సీఎం శ్రీ కేసీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.













