డా. అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎంఓ అధికారులు, పీఆర్వోలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.













