దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి గాంధీ
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ అహింస, సత్యగ్రహ దీక్షల ద్వారా స్వాతంత్య్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్థంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.













