గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ తమిళిసై పుట్టిన రోజు కావడంతో ఆమెకు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందచేసి, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తరువాత 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడిందని, దీని కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, అనేక రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దిక్సూచిగా నిలిచాయని తమిళిసై కొనియాడారు.