సీపీఐ, సీపీఎం నేతలతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. కేరళ సీఎం విజయ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేరళ సీఎం హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం విజయన్‌తో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కేసీఆర్ సమావేశమయ్యారు. వీరితో భేటీ ముగిసిన అనంతరం సీబీఐ జనరల్ సెక్రటరీ డి రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కేసీఆర్ సమావేశం అయ్యారు. కేంద్ర విధానాలు, జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.













