గవర్నర్ తమిళిసైని పరామర్శించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత కుమార్ కరోనాతో చనిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెను పరామర్శించారు. వసంత కుమార్ అంత్యక్రియల వీడియోలను ముఖ్యమంత్రికి గవర్నర్ చూపించారు. ఆయన మృతి తనను ఎంతో కలిచివేసిందని సీఎం అన్నారు. ఆయ మృతికి సంతాపం తెలిపారు. ఆ తరువాత కొద్దిసేపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అద్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.













