నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
రెండు వేల పడకల సామర్థ్యంతో నిమ్స్‌తో నిర్మించనున్న కొత్త బ్లాక్ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.1,571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బ్లాక్ నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త బ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త బ్లాక్‌కు దశాబ్ది బ్లాక్‌గా నామకరణం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ అనేది చాలా ముఖ్యమైనది. 2014లో ఆరోగ్య శాఖకు రూ.2,100 కోట్లు కేటాయించాం. 2023`24లో రూ.12,367 కోట్లు కేటాయించాం. సాంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. తెలంగాణ వచ్చాక వైద్యారోగ్య శాఖ అనేది ఎంతో కీలకం అని భావించాం. న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం వెనక చాలా ఆలోచన ఉంది. ఈ కిట్లతో ఒక తరం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గతంలో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ లాంటి ఆస్పత్రులే దిక్కు. వరంగల్‌లో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఆస్పత్రి కడుతున్నాం. హైదరాబాద్‌లో మరో ఆ 4 ఆస్పత్రులు కడుతున్నాం. వైద్యారోగ్య రంగంపై చక్కటి ప్రణాళికలు రూపొందించాలి. ఈ శాఖకు సహజంగా విమర్శలే ఎక్కువ. ఈ శాఖ సేవలపై మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.













