రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
భాగ్యనగరంలో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్`రాయదుర్గం కారిడార్`3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు మైండ్‌స్పేస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పునాదిరాయి వేశారు. 31 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ మెట్రో ఉంటుంది. 9 మెట్రో స్టేషన్లు ఉండేలా ప్లాన్ చేశారు. 29 నిమిషాల్లో చేరుకునేలా మెట్రో నిర్మించనున్నారు. రూ.6250 కోట్లతో మెట్రో ప్రాజెక్టు చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.













