హరితహారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్
ఇంట్లో పిల్లల్ని పెంచినట్టే మొక్కలను పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ హరితహరం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కతోనే మన జీవితం పెనవేసుకుందని అన్నారు. రేపటి నుంచి పది రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. ప్రజలంతా విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రతిగ్రామంలో గ్రీన్ బ్రిగేడ్ ఉండాలని సూచించారు. మొక్కల సంరక్షణ బాధ్యత గ్రీన్ బ్రిగేడ్ తీసుకోవాలన్నారు. కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమైందని అన్నారు. కరీంనగర్ పట్టణాన్ని లండన్ నగరంలా తయారు చేస్తానని అన్నారు.













