మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు.. సీఎం కేసీఆర్ భూమిపూజ
రాజధాని హైదరాబాద్ నగరంలోని కొత్తపేట (ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ (సనత్‌నగర్), అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ మూడు ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రాన్నాయి. ఒక్కో టిమ్స్‌ను 1000 బెడ్ల సౌకర్యంతో నిర్మించనున్నారు. ప్రతి ఆస్పత్రిలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్స్‌తో పాటు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు. వివేకానంద గౌడ్, కాలేరు వెకంటేశ్, సాయన్న, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.













