మెదక్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మెదక్ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని (కలెక్టరేట్‌ను) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయం బయట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద సీఎస్ శాంతి కుమారి రిబ్బన్ కట్ చేశారు. కార్యాలయం లోపల ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు, అధికారులతో కలిసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు తమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ కలెక్టర్‌కు శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు సీఎం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.













