జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
జోగులాంబ గద్వాల కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్లో కలెక్టర్ వల్లూరి క్రాంతిని కూర్చోబెట్టి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహ న్ రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













