సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి జిల్లాల బాట పట్టారు. ఇందులో భాగంగా ఆదివారం సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట సీఎం కేసీఆర్ సిద్దిపేటకు చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. తదనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. సుమారు 4 కోట్ల నిధులతో అత్యాధునికంగా నిర్మించారు. దీని వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కొండపాక మండలం రాంపల్లి శివారుల్లో నూతనంగా నిర్మించిన కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి 50 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవానాన్ని కూడా సీఎం ప్రారంభించారు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ గ్రూప్ ఫొటో దిగారు.