మేడ్చల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మేడ్యల్, మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యాలయంలో సీట్లో కలెక్టర్ ఎస్ హరీశ్‌ను కూర్చుండబెట్టి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎస్.హరిశ్ పాల్గొన్నారు.













