నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
నాగర్‌కర్నూల్ సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్లో కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్‌తో పాటు జిల్లా అధికారులు, నేతలు పాల్గొన్నారు.













