తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు
తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ సంబురాలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్లో సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజాలి ఘటించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిస్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్శరరావు, సంతోష్ కుమార్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు.













