జీహెచ్ఎంసీలో విజయం మనదే : కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం టీఆర్ఎస్దేనని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేవారు. తెలంగాణ భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన కీలక భేటీలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నేతలు తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ రెండోవారంలో జాతీయస్థాయి నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ సృష్టం చేశారు. ఈ సదస్సుకు దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానిస్తామన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే టీఎంసీ అధినేత్రి, పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ నేత కుమారస్వామి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవర్ తదితరులతో మాట్లాడినట్లు నేతలకు ఆయన వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీల మృతి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నేతలు నివాళులర్పించారు.













