సీఎం కేసీఆర్ శుభవార్త.. రేపటి నుంచి
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతు రుణమాపీపై ప్రగతి భవన్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుమమాఫీపై చర్చించారు. 2018 ఎన్నికల సందర్భంగా రూ.లక్ష లోపు రైతు రుణాలను మాపీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, కొంతమేర రుణాలు మాఫీ చేశామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. కరోనా లాంటి ఉపద్రవంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆర్థిక వెసులుబాటు లేక రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఆర్థిక పరిస్థితి కుదుట పడినందున రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.













