అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం కేసీఆర్…!!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో మూడు రోజులుగా పర్యటన సాగుతుంది. విలేకరుల ముందు వారు కొన్ని విషయాలు ప్రవేశపెట్టారు. వారు పెట్టిన అంశాలు చాలా అవాస్తవాలు ఉన్నాయి. 90 వేల కోట్లు తెలంగాణ కు ఇప్పటికే ఇచ్చామన్నారు. సరే అని వదిలేశాం. అమిత్ షా చెప్పింది కరెక్ట్ మేము చర్చకు సిద్ధమన్నారు. వారు పదవులు అనుభవించలేదు కాబట్టి ఆ వ్యాఖ్యలను వదిలేశాం. మళ్లీ ఇప్పుడు వచ్చి మూడు రోజులుగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ దేశంలోనే గొప్ప పాలన ను అందిస్తున్నాం.
తెలంగాణ ధనిక దేశం. మేము ప్రపంచంతో పోరాడుతున్నాం. కేసీఆర్ స్వభావం మీరు తెలుసు వ్యక్తిగతంగా నన్ను తిట్టినా నేను పడతాను కాని రాష్ట్రాన్ని తిడితే నా ప్రాణం పోయినా నేను రాజీ పడను. ఒక నిబద్ధతతో పని చేస్తున్న ప్రభుత్వం మాది. ప్రధాని మోదీ, అనేక మంత్రి కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి వచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్ గురించి చూసి అభినందించారు. వాటర్ మాన్ గా ఉన్న రాజేంద్ర సింగ్ తెలంగాణ లోని ఒక చెరువుకట్టపై పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. తెలంగాణ మాడల్ ను కాపీ కొట్టండని కేంద్ర మంత్రి ఉమాభారతి 29 రాష్ట్రాలకు సూచించింది.
నీతి ఆయోగ్ అధికారులు ఇంతమంది అభినందిస్తుంటే అమిత్ షా గారు మమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు చెబితే అది నిజమవునుకుంటారు. నేను మౌనంగా ఉంటే అది నిజమనుకుంటారు. ఇక్కడ బీజేపీ స్థాయి ఏంటో మీకే తెలుసు. నాకు కల పడుతుంది నేను దేశాన్ని పరిపాలిస్తానని, ప్రధాని అవుతానని కాని అది అవుతుందా. వాళ్లా పార్టీ ని విస్తరించుకోవడానికి మేము అభ్యంతరం చెప్పడంలేదు. ఎన్నికల్లో ఎవరితోనో ఒకరితో పోరాడాలి. రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తిగా వారు చెప్పిన అవాస్తవాలను నేను ఖండిస్తున్నాను. భారత దేశాన్ని పెంచిపోషిస్తున్న రాష్ట్రాలు 6, 7 ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు అన్నిలోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాలు.
దేశాన్ని పెంచిపోషిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ ఈ రాష్ట్రాలు ఉన్నాయి. దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు 2016-17 లో ఇన్ కమ్ ట్యాక్స్ రూ.32,186 కోట్లు. సర్వీస్ ట్యాక్స్ .. రూ.7,671 కోట్లు, కస్టమ్ ట్యాక్స్ రూ. 3328 కోట్లు. సెంట్రల్ ఎక్సైజ్ రూ.6828 కోట్లు.. మొత్తం రూ.50013 కోట్లు తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి పంపిన డబ్బు. 2016-17 లో కేంద్రం నుంచి వచ్చిన డబ్బు రూ.24, 561 కోట్లు. తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తెలంగాణ కు ఇచ్చింది సగంకూడా కాదు. ఎవరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. కేంద్రానికి రూ.25,452 కోట్లు మైనస్ చేస్తే ఇచ్చే ది మేము.. తెలంగాణ కు మీరిచ్చే బిక్షం మీద బతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు. అమిత్ షా మాట్లాడింది అంతా అబద్ధం.
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రూ.20 వేల కోట్లు ఇస్తున్నామంటున్నారు. దేనికి అదనంగా ఇస్తున్నారో చెప్పాలి. ఇంత అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు. యూనివర్సిటీలు వీళ్లు మంజూరు చేసింది కాదు వీళ్లుకు పార్లమెంట్ చట్టరూపంలో నిర్దేశించింది. రెండు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు షడ్యూల్ యాక్ట్ 13 కింద ట్రైబల్, వెటర్నరీ, హర్టీకల్చర్ యూనివర్సిటీ ఇవ్వాలని చట్టం చెబతుంది. వీరు రెండు మాత్రమే పూర్తి చేశారు ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా రాలేదు. కాని అమిత్ షా ఇచ్చామని చెబుతున్నారు. యూనివర్సిటీల కోసం రూ.40,800 కోట్ల విషయం చెప్పారు. యూనివర్సిటీ పెట్టాలంటే అంత ఖర్చు అవుతుందా. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లు సాయం చేసిందంట.
మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 67,390 కోట్లు యథావిధిగా అన్ని రాష్ట్రాలకు రావాల్సిన విధంగా ఇచ్చేది. 2014 జూన్ 2 నుంచి 24 మే 2017 వరకు కేంద్రం ఇంతే ఇచ్చింది. కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా ఈ మూడు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి వచ్చింది రూ.37,773 కోట్లు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రూ. 18,574 కోట్లు. జాతీయ రహదారుల కింద ఇప్పటివరకు రాష్ట్రానికి మంజూరైన నిధులు రూ.2,055 కోట్లు ఇది కేంద్రమే ఖర్చు పెడుతుంది. బీఆర్జీఏ కింద సెక్షన్ 94 సబ్ సెక్షన్ 2 కింద విభజన చట్టం పార్లమెంట్ ఆదేశం కింద ఇవ్వాల్సినది ఏపీకి మూడు వాయిదాలు ఇచ్చారు మనకు రెండే ఇచ్చారు.
దీని కింద ఇచ్చిన డబ్బు రూ.1,016 కోట్లు ఇవ్వాలి. ప్రధాని మోదీ కూడా నేను ఇప్పిస్తానని అన్నారు. అమిత్ షా ఢిల్లీకి పోతే ఈ పని చేయాలి. ఫైనాన్స్ కమిషన్ కింద వచ్చిన నిధులు రూ. 5,160 కోట్లు. కరువు, వరదలు వచ్చినప్పుడు ఇచ్చే డబ్బులు మనం అడిగింది రూ. 6 వేల కోట్లైతే రూ. 856 కోట్లు ఇచ్చారు. మనకు రూ.12,147 కోట్ల పైచిలు సీఎస్టీ బకాయిలు రావాలి. అరుణ్ జైట్లీకి ఇప్పటివరకు వంద సార్లు అడిగాను. ఏపీకి మాకు కలిపి ముందే ఇవ్వమని అడిగాం. కాని ఇవ్వలేదు. బకాయి రావాల్సింది రూ.10, 190 కోట్లు కేంద్ర మనకు ఇవ్వాల్సింది. అమిత్ షా ఢిల్లీకి పోయి ముందు ఈ పని చేయి. బీజేపీ మాకు ప్రత్యేకంగా చేసిన సాయం ఏమి లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాల్సిందే. యూపీఏ ప్రభుత్వం లో మోడల్ స్కూళ్లు పెట్టింది ఈ ప్రభుత్వం ఆ స్కీమ్ ఎత్తేసింది ఆ బరువు మేము మోస్తున్నాం. అలాగే అంగన్ వాడీ కింద బడ్జెట్ రూ.17వేల కోట్లు ఉంటే రూ.8 వేల కోట్లు పెట్టారు.
అంగన్ వాడీ టీచర్లకు కేంద్రం ఇచ్చేది రూ.4200 అయితే తెలంగాణ ఇచ్చేది రూ.10,500 మేము అధనంగా బరిస్తున్నాం. ఆశా వర్కర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదికాక రూ.6 వేలు ఇస్తున్నాం. పెన్షన్లు ఇచ్చే గతి లేదని అమిత్ షా అంటున్నాడు. 38 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. పెన్షన్లకు అయ్యే ఖర్చు రూ.5 వేల కోట్లయితే కేంద్రం నుంచి రూ.209 కోట్లు వస్తుంది. సముద్రంలో కాకి రెట్ట వేసినట్లుగా ఉంది. ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిన్నగా చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్ని తప్పుడు ప్రచారం చేసినందుకు అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
నేను చెప్పినవి తప్పయితే నేను సీఎం పదవికి రాజీనామా చేస్తాను ఇది నా ఛాలేంజ్. ఈ రోజు ఒక లక్ష కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని హైదారాబాద్ నుంచి సంపాదించి కేంద్రానికి అప్పగిస్తున్నాం. నీ చిల్లర రాజకీయాల కోసం మా రాష్ట్ర ప్రగతిని కించపరుస్తావా. మా రాష్ట్రం అడుకునే రాష్ట్రం కాదు. దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం తెలంగాణ. బీజేపీ నేతలు తెలంగాణన చాలా సార్లు ఇలా మాట్లాడారు. నువ్వు తేరాట్ పల్లిలోని దళిత వాడలో పండలేదు, కమ్మగూడెంలో మనోహర్ రెడ్డి మామిడి తోటలో వండింది తిన్నావు.
దళితుల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేంద్రం పెట్టేది రూ. 52,392 కోట్లు. తెలంగాణ రాష్ట్రం రూ.31,919 కోట్లు దళితులకు కేటాయించాం. ఎస్సీ, ఎస్టీ ల కోసం మేము ఖర్చు పెడుతున్నాం. కేంద్ర బడ్జెట్ లో 3.93 శాతం మేము ఖర్చు పెడుతున్నాం. నల్గొండలోని అన్నపూర్ణ మెస్ భోజనాన్ని మీరు తిన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని మీరు క్షించపరిచారు. ఆనాడు ఎల్ కే అద్వాని మాట్లాడుతూ హైదరాబాదే తెలంగాణలో ఉంది మీకు తెలంగాణ ఎందుకని మాట్లాడారు. చట్టప్రకారం తెలంగాణలో పవర్ ప్లాంట్ సీలేరు కరెంట్ ప్రాజెక్టు ను మీరు ఏపీకి అప్పగించారు.
అప్పుడు చంద్రబాబుకూడా డ్రామా అడారు. తెలంగాణ ఒక విఫల ప్రయోగమని నిరుపించాలని అప్పటి సీఎం చంద్రబాబు మాకు కావాల్సిన కరెంట్ ను సప్లే చేయడు. నిరజా కమిటీ ఏపీ ప్రభుత్వం చెసేది అని చెప్పింది. మా కాళ్ల మీద మేము ఇవాళ నిలబడ్డాం. కేంద్ర ప్రభుత్వ పథకాల కన్నా మేము అడ్వాన్స్ గా ఉన్నాం. రెండు స్కీమ్ లు బాగున్నాయని చెప్పి నీతి ఆయోగ్ రూ.24 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశాం. మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు. మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు ఇవ్వమని అడిగాం. నల్ల ధనం తెస్తామన్నారు ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారని ఢిల్లీ ఎన్నికల్లో అమిత్ షాను ఒక విలేకరి అడిగితే ఆయన అంటాడు అన్ని చెబుతాం చేస్తామా అని అన్నాడు.
తెలంగాణలో ప్రజలు కలిసి ఉండరని చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1927 మహాత్మ గాంధీ ఇక్కడ పర్యటించారు. ఇక్కడ ఐక్యమత్యం, సంస్కృతిని చూసి ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులను చూసి నేర్చుకోవాలని అన్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రధానికి దేశంలో ఎవ్వరు చేయని సపోర్ట్ నేను చేశాను. మోదీతో నాకు వైరం లేదు. మేము తెచ్చుకున్న తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి. తెలంగాణ ను నిందిచిన ఎవర్వైనా మాకు శత్రువే. ఈ ప్రపంచంలో తెలంగాణను ఎవరు కించపరిచినా మేము క్షమించం. కేసీఆర్ ఎన్నో తుపానులను చూశాడు, ఇది తుపాను కాదు కద గాలి కూడా కాదు. జనాలకు ఏది మంచిదో దాని కోసం కేసీఆర్ పోరాడతాడు. తెలంగాణలో బీజేపీ పాత్ర ఏమిటో వాళ్లే నిర్ణయించుకోవాలి.













