వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేర్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిన విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలకు వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.













