సీఎం కేసీఆర్ కీలక ప్రకటన… కొత్తగా 10 లక్షల మందికి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం పింఛన్దారుల సంఖ్య 46 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు. 57 సంవత్సరాలున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు సైతం పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.2016 పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.













