దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
దసరా పండగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండగను విజయదశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకొంటారని తెలిపారు. పండగ నాడు కుటుంబ సభ్యులందరూ ఒకేచోట గుమిగూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమీపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్తో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంత ప్రత్యేకతకు నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.













