తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సతీసమేతంగా పాల్గొన్నారు.
బిర్కూర్ మండలంలోని ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలతో కూడిన పైలాన్ ను సీఎం ఆవిష్కరించారు. శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం చేయించిన రెండు కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి సీఎం కేసీఆర్ దంపతులు సమర్పించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, శ్రీ బి.బి.పాటిల్, ఎమ్మెల్సీ శ్రీ గంగాధర్, శ్రీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్, శ్రీ ఎ. జీవన్ రెడ్డి, శ్రీ జాజుల సురేందర్, శ్రీ గంప గోవర్ధన్, శ్రీ గణేష్ బిగాల, మాజీ ఎమ్మెల్సీలు శ్రీమతి ఆకుల లలిత, శ్రీ నర్సారెడ్డి, డిసిసిబి ఛైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి.పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.













