శారదా పీఠంలో సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖపట్నంలోని శారాదా పీఠాన్ని సందర్శించారు. ఎన్నికల ముందు తనకు రాజ శ్యామల యాగం చేసిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందారు. కేసీఆర్ దంపతులకు స్వయంగా స్వరూపానందేంద్ర స్వాగతం పలికారు. అనంతరం, స్వామీజీకి కేసీఆర్ నూతన వస్త్రాలు సమర్పించారు. సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడి శారదా మాతను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా, పీఠంలో నిర్వహించిన యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం పీఠం లోనే భోజనం చేశారు. మధ్యాహ్నం 12:10 గంటలకు పీఠానికి చేరుకున్న కేసీఆర్.. సుమారు రెండున్నర గంటలపాటు అక్కడే గడిపారు. మధ్యాహ్నం 2:35 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్‌కు పయనమయ్యారు. బందోబస్తులో భాగంగా విశాఖ పోలీసులతోపాటు తెలంగాణకు చెందిన బలగాలు కూడా శారదా పీఠం వద్ద సెక్యూరిటీ బాద్యతలు చేపట్టాయి. మీడియాను, ఇతరులను అనుమతించలేదు.













