టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
రంగారెడ్డి, వరంగల్, నల్గొండ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రంగారెడ్డికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్‌కు పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ స్థానానికి పార్టీ సీనియర్ నాయకుడు తేరా చిన్నపరెడ్డిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, జిల్లా మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వారిని ముఖ్యమంత్రి అభినందించి బీఫారాలను అందజేశారు. ఈ నెల 14న మంచి రోజని, నామినేషన్లు దాఖలు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను కేటీఆర్, మూడు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి అప్పగించారు.













