ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మలేశం కురమలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. మరొక సీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.













