పద్మశ్రీ గ్రహీతలకు సీఎం కేసీఆర్ భారీ నజరానా
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు ఆయన స్వస్థలం కొత్తగూడెంలో నివాస యోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రికార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు.
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని నిర్మాణం ఖర్చుల కోసం కోటీ రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్యయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం కేసీఆర్ ఆదేశించారు.













