పద్మశ్రీ మొగిలయ్యను ఘనంగా సన్మానించిన సీఎం కేసీఆర్
ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మెగిలయ్యను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మెగిలయ్యకు పద్మశ్రీ రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మెగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతోపాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటీ రూపాలను ఈ సంద్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతాన్ని కూడా అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవిపం చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.













