తెలంగాణలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కానున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అదనంగా సమీప భవిష్యత్తులో సిద్దిపేట సమీపంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం కొలువుదీరే అవకాశం ఉందని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ఒక డైనమిక్ ప్రదేశం అన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. భవిష్యత్తులో సిద్దిపేట సమీపంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మనం ఆశించవచ్చు అన్నారు.













