50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఆ సమస్యను … పరిష్కరించలేదు
యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేక పోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో, ఉద్యమ కాలంలో నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటలు కరెంటు లేదు. కానీ, తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తాం. పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవు. డబ్బు మదంతో పనిచేసే వాళ్లుకు బుద్ధి చెప్పాలి. పాలమూరు`రంగారెడ్డి పూర్తయితే శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తాం. మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. ఉప ఎన్నికల్లో చూపిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు మళ్లీ చూపాలి. చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు ధన్ బేహార్లను తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు.













