సీఎం కేసీఆర్పై అభిమానంతో…నాగళ్లతో భారీ చిత్రం
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు. రైతుల వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారనే అర్థం వచ్చేలా సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో నాగళ్లతో భారీ చిత్రాన్ని రూపొందించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందుకు గుర్తుగా చిత్రాన్ని గీశామని తెలిపారు. చిత్రాల పక్కనే టీఆర్ఎస్ వెంట నాగార్జునసాగర్ అని ఆంగ్లంలో రాశారు.













