ప్రజా కవి గోరటి వెంకన్నకు.. సీఎం వైఎస్ జగన్ అభినందనలు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021కి ఎంపికయిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సే గోరటి వెంకన్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. గోరటి వెంకన్న రచించిన వల్లంకి తాళం కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ వార్డు లభించింది. సామాన్యుడికి చేరేలా హావభావాలతోటి గ్రామీణ జానపదాలతో ఆయన ప్రజల హృదయాలు గెలిచారని, ఒక లెజెండరీగా ఎదిగారని తెలిపారు. వారి ప్రజా గేయాలు ఈనాటికీ యువకుల్లో స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. ఆయనతో పాటు యువజన, పిల్లల విభాగంలో అవార్డులు గెలుచుకున్న తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహరాజ్‌కు కూడా ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.













