2019 టికెట్ల జాబితా సిద్ధం : చంద్రబాబు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, ధైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని రమణకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మెతక వైఖరి మానుకోవాలని, కఠినంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మహానాడు తరువాత మళ్లీ వస్తానని అప్పటిలోగా పార్టీ కమిటీలు పూర్తి చేస్తానని రమణకు బాబు చెప్పారు. జాతీయ మహానాడు తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని తెలిపారు. 2019లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో తాను జాబితా సిద్ధం చేసుకున్నానని, ప్రతిభను బట్టి ముందుగానే టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. మనం బలంగా ఉంటనే ఎవరైనా పొత్తులకు ముందుకు వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.













