మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం, మంత్రులు
మేడిగడ్డ బ్యారేజీని ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరిన ప్రజాప్రతినిధులు మేడిగడ్డ చేరుకున్నారు. ప్రధానంగా బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను పరిశీలించారు.













