దీక్ష విరమించిన భట్టి విక్రమార్క
సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విరమించారు. నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న ఆయనకు పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతకుముందు ఏఐసీసీ నేతలు భట్టితో ఫోన్లో మాట్లాడారు. దీక్షను విమరించాలని కోరారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు దీక్షను విరమిస్తున్నట్టు భట్టి వెల్లడించారు. ఇందిరా పార్క్ వద్ద భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి నిమ్‌సకు తరలించారున ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. నిమ్స్‌కు తరలించిన అనంతరం భట్టిని పలువురు నేతలు పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఈనెల 8 నుంచి భట్టి ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.













