హైదరాబాద్‌లో క్లీన్ హార్బర్స్ కార్యాలయం
ఉత్తర అమెరికాకు చెందిన ఎనర్జీ, ఇండస్ట్రియల్ సేవల సంస్థ క్లీన్ హార్బర్స్ హైదరాబాద్‌లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, సీఈవో అలన్ మెకిమ్ మాట్లాడుతూ హైదరాబాద్ ఆఫీస్‌ను మరింత విస్తరించడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని భవిష్యత్తులో అంతర్జాతీయ కెపబిలిటీ సెంటర్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు పుణె, బెంగళూరులలో ఉన్న కార్యాయాల్లో 1,200 మంది సిబ్బంది విధులు నిర్వస్తుండగా, భవిష్యత్తులో మరో వెయ్యి మందిని తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.













