తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం
తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా కొత్త డిస్ట్రిక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ ఆవతరణ జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ఈ కోర్టులు పనిచేయనున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పది జిల్లాల్లో డ్రిస్టిక్ కోర్టులు ఉండేవి. ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల సంఖ్య 33కి పెరిగింది. అన్ని జిల్లాల కోర్టులకు జడ్జీలను నియమిస్తూ గతంలోనే ఉత్తర్వులను వెలువరించింది. రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులో జాతీయ జెండాను ఎగురవేయాలని హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వెంటనే కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ కోర్టులు కూడా పనిచేయనున్నాయి. పాలనా సంస్కరణలో భాగంగా జిల్లాలను 33కు పెంచిన ఫలితంగా కొత్త డిస్ట్రిక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. న్యాయ చరిత్రలో ఒకేసారి 23 కొత్త జిల్లాల కోర్టులు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసులు విచారణ వేగవంతం అవుతుంది. హైకోర్టు కూడా జిల్లాలకు పోర్టు పోలియో జడ్జీలను నియమించింది.













