యాదాద్రిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీజేఐ దంపతులను పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. వీరితో పాటు మంత్రులు జగదీశ్ రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్వాగతం పలికారు. అనంతరం రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి, తమ మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణాలను సీజేఐ పరిశీలించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ కూడా సీజేఐ వెంట వెళ్లాల్సి ఉంది. దగ్గరుండి ఆలయ అభివృద్ధి పనులను వివరిస్తారని అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఈ పర్యటనలో పాల్గొనలేదు.