సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు డాక్టరేట్
మాతృభాష, మాతృమూర్తి మాతృదేశాన్ని మరవొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విద్యార్థులకు సూచించారు. ఉస్మానియాని వర్సిటీ 82వ స్నాతకోత్సవానికి ముఖ్య అథిథులుగా గవర్నర్ తమిళిసై, సీజేఐ ఎన్.వి.రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టీస్ ఎన్.వి.రమణకు డాక్టరేట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రదానం చేశారు. అనంతరం జస్టిస్ రమణ మాట్లాడుతూ మీరు ఎక్కడున్నాగానీ పుట్టిన గడ్డని మరవకూడదని చెప్పారు. మనం ఏ సమాజం నుంచి వచ్చామో మన వంతుగా ఆ సామాజ అభివృద్ధికై కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెలుగు సాహిత్యాన్ని చరిత్రను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉత్తరాలు రాయడం, పుస్తకాలు చదవడం లాంటివి నేటి యువత అలవర్చుకోవాలన్నారు. ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనం సంస్కృతి, మన మూలాలను అస్సలు మరువొద్దని ఆయన చెప్పారు. తనకు డాక్టరేట్ ప్రాదానం చేసినందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, వీసీ రవీందర్‌కు సీజేఐ ఎన్.వి.రమణ కృతజ్ఞతలు తెలిపారు.













