సీజేఐ ఎన్వీ రమణకు ఘన స్వాగతం…

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‍కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‍రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, జీహెచ్‍ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, పలవురు ఎమ్మెల్యేలు సీజేఐకు స్వాగతం పలికారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజ్‍భవన్ అతిథిగృహానికి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. సీజేఐ మూడు రోజుల పాటు రాజ్‍భవన్ అతిథి గృహంలో ఆయన ఉండనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక నగరానికి ఎన్వీ రమణ రావడం ఇదే తొలిసారి కావడంతో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు.