ట్యాంక్ బండ్ పై సినారె విగ్రహం : కేసీఆర్
మహాకవి, గొప్ప సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి విగ్రహన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సినారె పార్థివదేహానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌తోపాటు పూర్వపు కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల, హనుమాజీపేటలోని నినారె కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని అన్నారు. నగరం నడిబొడ్డున సినారె స్మారక మ్యూజియం, సాహితీ సమావేశ మందిరం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలోని ఓ ప్రముఖ సంస్థకు లేదా ఓ యూనివర్సిటీకి సినారె పేరు పెడుతామని అన్నారు. సినారె విశిష్టమైన సాహితీవేత్త అని తెలిపారు. కవులు, రచయితలు చాలా మంది ఉంటరు కానీ, సినారె సభ అంటే సినారె మాటా అంటే ఓ గ్లామర్ అని పేర్కొన్నారు. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె అని అన్నారు. సినారె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చేవారి కోసం జిల్లా కేంద్రాల నుంచి 100 బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.













