బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా
తెలంగాణలోని అధికార బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపించినట్టు తెలిపారు. తన నివాసంలో అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపినట్టు తెలిపారు. చిత్తరంజన్ దాస్ బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానుండగా, ఆయన సమక్షంలోనే చిత్తరంజన్ కాషాయతీర్థం తీసుకోనున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో చిత్తరంజన్ దాస్ భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించగా, అందుకే చిత్తరంజన్ దాస్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.













