Chirravuri: ఖమ్మం పై చిర్రావూరి చెరగని ముద్ర .. ఏకంగా ఐదుసార్లు ఎన్నిక
ఐదుసార్లు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై ఖమ్మం నగరం అభివద్ధిలో చెరగని ముద్ర వేశారు చిర్రావూరి లక్ష్మీనర్సయ్య (Chirravuri Lakshmi Narsayya). 1915 మార్చి 20న ఖమ్మం జిల్లా కైకొండాయిగూడెంలో భూస్వామ్య కుటుంబంలో ఆయన జన్మించారు. ఆంధ్ర మహాసభ ప్రభావంతో ఖమ్మంలో గ్రంథాలయాన్ని స్థాపించారు. చండ్ర రాజేశ్వరరావు (Chandra Rajeshwara Rao), నండూరి ప్రసాదరావుల పరిచయంతో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని జైలుపాలయ్యారు. 1952లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 1987 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లో గెలిచి ఖమ్మం మున్సిపాలిటీ చైర్మన్ (Municipality Chairman)గా బాధ్యతలు నిర్వర్తించారు. 1952లో 28 వేల జనాభాతో ఉన్న ఖమ్మం నగరాన్ని ముందుచూపుతో ప్రగతి పథంలోకి తీసుకొచ్చారు. తొలి బహత్ ప్రణాళిక ( మాస్టర్ ప్లాన్) రూపొందించి తాగునీరు, రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. కాలినడకన, తర్వాత సైకిల్‌పై ఖమ్మం వీధుల్లో తిరుగుతూ ప్రజాసమస్యలు తెలుసుకునేవారని ఇప్పటికీ నగర పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













