Cherlapally :6న చర్లపల్లి టెర్నినల్ ప్రారంభం

ఆధునికీకరించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapalli Railway Terminal) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ నెల 6న తేదీన ఢల్లీి నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. గత ఏడాది డిసెంబరు 28న ఈ టెర్నినల్‌ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌ల చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడిరది.
కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు చేపట్టిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా ప్రాజెక్టులో కీలక పనులు గత నెలలో పూర్తయ్యాయి. ఈ అనుసంధాన ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని మోదీతో ఈ నెల 6వ తేదీన ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంగా చర్లపల్లి టెర్నినల్‌ను కూడా ప్రారంభించాలని ప్రధానిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌లు కొద్దిరోజుల క్రితం కలిసి కోరగా అందుకు ఆయన అంగీకరించారు. చర్లపల్లిలో జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), కశ్మీర్‌లో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొంటారు. కశ్మీర్‌కు ఓ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, రెండు మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించే అవకాశం ఉంది.